జొన్న రొట్టెలు


జొన్న రొట్టెలు

కావలసిన పదార్థాలు

జొన్న పిండి - రెండు కప్పులు
నీరు - తగినంత
ఉప్పు - సరిపడా

తయారీ విధానం 

ముందుగా పిండికలపడానికి సరిపడా నీరు తీసుకుని బాగా కాయాలి . ఇప్పుడు జొన్నపిండిలో తగినంత ఉప్పువేసి ఆ నీటిని కలుపుతూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ ముద్దలను పీటమీద లేదా  పలచటి కవర్ లేదా తడిపినగుడ్డ మీద  చపాతీల్లాగా చేతితో ఒత్తుతూ గుండ్రంగా చేసుకోవాలి.

వీటిని అట్ల పెనం మీద వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు