రాగి ఇడ్లీ
కావలసిన పదార్థాలు
ఇడ్లీ పిండి - 2 కప్పులు, రాగి పిండి - అర కప్పు, వేడి నీళ్లు - పావు కప్పు, ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
తయారీ విధానం
నీళ్లు వేడి చేసి
రాగి పిండి వేసి చిక్కటి పేస్ట్‌లా కలపాలి. ఈ పేస్ట్‌ను ఇడ్లీ పిండిలో వేసి
కలపాలి. 15 నుంచి 20 నిమిషాలు పక్కనుంచితే పిండి నీళ్లను పీల్చుకుంటుంది. తర్వాత ఇడ్లీ
ప్లేట్లకు నూనె రాసి పిండితో నింపాలి. ఇలా అన్ని ప్లేట్లు నింపుకున్న తర్వాత ఇడ్లీ
కుక్కర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత కుక్కర్‌లో ఇడ్లీ ప్లేట్లూ ఉంచి, ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. సాంబారు
లేదా కొబ్బరి చట్నీతో వేడిగా వడ్డించాలి.

0 కామెంట్‌లు