స్వీట్‌ దోసె

స్వీట్‌ దోసె

కావలసిన వస్తువులు:

మైదా - 1 కప్పు
పాలు - కలపడానికి సరిపడా
పంచదార - పావు కప్పు
ఏలకులపొడి - 1 టీ స్పూన్‌
బాదం పప్పు - 2 టీ స్పూన్స్
నూనె - కాల్చడానికి సరిపడా

తయారు చేసే విధానం:

ఒక పాత్రలో మైదా, ఏలకులపొడి, పంచదార, బాదంపప్పు ఒకదాని తరువాత ఒకటి తీసుకుని, పాలతో కలుపుకోవాలి. ఉండలుండలుగా లేకుండా బాగా కలపాలి. మరీ పలచగా కాకుండా గరిటజారుడు దోసె పిండిలా కలుపుకోవాలి. పెనం వేడయ్యాక గరిటతో పిండిని తీసుకుని దోసెలా వేసి,దోసె చుట్టూ నూనె వెయ్యాలి. గోల్డెన్‌ బ్ర్రౌన్‌ కలర్ వచ్చేవరకు ఉంచి నెమ్మదిగా తీసి వెనక వైపు తిప్పేసి 5 సెలన్లు కాల్చాలి. వేడివేడి నెయ్యి వేసి వడ్డించాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు