క్యారెట్ జామ్

క్యారెట్ జామ్


కావలసిన వస్తువులు:

క్యారెట్ - 250గ్రా
పంచదార - 350 గ్రా
నిమ్మరసం - 1 చెంచా
నీళ్ళు - 1కప్పు

తయారు చేసే విధానం:

క్యారెట్లను కడిగి, చెక్కుతీసుకుని తురుముకోవాలి. తురుముకు నీళ్ళు చేర్చి స్టౌమీద పెట్టి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తురుముకు పంచదార చేర్చి నీళ్ళన్నీ ఇంకిపోయేవరకూ స్టౌమీద ఉంచాలి. చివరిగా నిమ్మరసం చేర్చి దీన్ని పొడిగా ఉన్న సీసాలోకి తీసుకోవాలి. ఇష్టమైన వారు చిటికెడు యాలకుల పొడి కూడా చేర్చుకోవచ్చు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు