కాంచీపురం ఇడ్లీ


కాంచీపురం ఇడ్లీ


కావలసినవి 
ముడిబియ్యం: కప్పు, ఇడ్లీ బియ్యం: కప్పు, మినప్పప్పు: కప్పు, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, శొంఠిపొడి: టీస్పూను, తాలింపుకోసం: నువ్వులనూనె: టేబుల్‌స్పూను, మినప్పప్పు: 2 టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, జీడిపప్పు: పది, ఇంగువ: పావు టీస్పూను

తయారుచేసే విధానం 
రెండు రకాల బియ్యం, మినప్పప్పు కడిగి విడివిడిగా సుమారు రెండుగంటలపాటు నానబెట్టాలి. 
 ముందు మినప్పప్పు రుబ్బి తరవాత బియ్యం కూడా మెత్తగా రుబ్బి రెండూ కలపాలి. ఉప్పు వేసి కలిపి సుమారు ఆరుగంటలపాటు పులియనివ్వాలి. మర్నాడు పిండిలో శొంఠిపొడి, మిరియాలపొడి, జీలకర్ర వేసి కలపాలి. విడిగా చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, మినప్పప్పు వేసి వేయించిన తాలింపును కూడా పిండిలో కలపాలి. పిండి మిశ్రమాన్ని కాంచీపురం ఇడ్లీ పాత్రల్లో మాదిరిగా ఆకుల్లోపెట్టి ఉడికించాలి. లేదంటే నెయ్యి రాసిన మామూలు ఇడ్లీ రేకుల్లో వేసి వాటిని పాత్రలో పెట్టి ఆవిరిమీద సుమారు పావుగంటసేపు ఉడికించి దించి కొబ్బరి, పల్లీ చట్నీతో వడ్డిస్తే సరి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు