రైస్ ఇడ్లీ
కావలసినవి:
బియ్యపురవ్వ: ఒకటిన్నర కప్పులు, పలుచని అటుకులు: కప్పు,పుల్లని పెరుగు లేదా మజ్జిగ: కప్పు, బేకింగ్ సోడా: చిటికెడు, మంచినీళ్లు: తగినన్ని, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం:
అటుకుల్ని పెరుగులో వేసి నాలుగు నిమిషాలు నానబెట్టి గరిటెతో మెత్తగా చేయాలి. అందులోనే బియ్యపురవ్వ వేసి కొద్దిగా సోడా, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి. అటుకులు, బియ్యపు రవ్వ నీటిశాతాన్ని పీల్చేసుకోవడంతో గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కలిపి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. దించేముందు ఇడ్లీలు ఉడికాయో లేదో ఓసారి వేలితో నొక్కి చూస్తే తెలిసిపోతుంది.

0 కామెంట్‌లు