దహీ ఇడ్లీ
కావల్సినవి: చిన్న ఇడ్లీలు పద్దెనిమిది, తాజా పెరుగు రెండు కప్పులు, కొబ్బరిముక్కలు రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి రెండు, అల్లం ముక్కలు చెంచా, చక్కెర రెండు చెంచాలు, ఉల్లిపాయ ఒకటి, బూందీ లేదా సన్న కారప్పూస అరకప్పు, ఎండుమిర్చి రెండు, కరివేపాకు రెండురెబ్బలు, కొత్తిమీర తరుగు మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె టేబుల్‌స్పూను.
తయారీ: పెరుగును గిలకొట్టి పెట్టుకోవాలి. కొబ్బరిముక్కలూ, పచ్చిమిర్చీ, అల్లం తరుగూ మిక్సీలో తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని గిలకొట్టిన పెరుగులో వేసేయాలి. తరవాత ఇందులో ఉల్లిపాయ ముక్కలూ, చక్కెరా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఇడ్లీలు వేసేయాలి. బాణలిలో నూనె వేడిచేసి ఎండుమిర్చీ కరివేపాకు రెబ్బలూ వేయించి పెరుగులో వేసేయాలి. ఆ తరవాత రెండుగంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. వడ్డించే ముందు బూందీ లేదా సన్నకారప్పూసా, కొత్తిమీర తరుగూ అలంకరిస్తే సరిపోతుంది.

0 కామెంట్‌లు