గోబీ మంచురియా

గోబీ మంచురియా
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - 1
మైదా - 3/4 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్స్
కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్
ఆలుగడ్డ - 1
ఉల్లిగడ్డ -1
అజినామొటో - పావు టీ స్పూన్
పచ్చిమిరపకాయలు - 2
టమాటా సాస్ - 2 స్పూన్స్
సోయాసాస్ - 2 స్పూన్స్
కొత్తిమీర - అర కట్ట
నూనె ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
ఒక గిన్నెలో మైదా కార్న్‌ఫ్లోర్ ఉప్పు నీళ్లు పోసి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ముందే ఉడికించి పెట్టుకున్న అలుని చిదిమి అది కూడా కలపాలి.కడాయిలో నూనె పోయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమంలో గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో అజినామొటో సోయాసాస్ టమాటా సాస్ వేసి కలపాలి.ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న గోబీని ఇందులో వేసి మరికాసేపు కలియబెట్టాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.

x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు