అవిసి ఆకు కూర

ఇరువది ముప్పది అడుగులెత్తు పెరుగును. పువ్వులు పెద్దవి. ఎర్రగానైనను, తెల్లగనైనను వుండును. ఈ చెట్లెత్తుగా పెరిగి సూర్య రస్మినడ్డు పెట్టకుండుటచే తమలపాకులతోటలలో వీనిని బాతి వానిమీద తీగెలు బ్రాకించెదరు. గొందరు లేత యాకులను కూర వండుకొందురు.క్యాల్షియం..ఇరవై గుడ్లు, పది కప్పుల పాలు, అరకిలో మాంసం ద్వారా లభించే 'క్యాల్షియం' ఒక గుప్పెడు అవిసాకులో లభిస్తుంది.విటమిన్ ఏ..ఇరవై కప్పుల పాలు, ఐదుకిలోల మాంసం ద్వారా లభించే 'విటమిన్ ఏ' ఒక గుప్పెడు అవిసాకుతో లభిస్తుంది. 

అవిసి ఆకు కూర

కావలిసిన వస్తువులు:
అవిసె ఆకు - 250 గ్రా
కంది పప్పు - 100 గ్రా
పచ్చి కొబ్బరి - అర చిప్ప
పచ్చి మిర్చి - 15 కాయలు
చింత పండు పులుసు - 2 tbsp
పంచదార - 1/2 tsp
పసుపు 1/2 tsp
ఉప్పు -  సరిపడినంత
మినప పప్పు - 1/2 tsp
 మెంతులు - 1/4 tsp
జీలకర్ర - 1/4 tsp
ఆవాలు - 1/4 tsp
కరివేపాకు కొత్తిమీర
నూనె - 1 1/2 tbsp

తయారీ:
అవిసె ఆకూ ఉడికించి నీళ్ళు  వంచి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.కంది పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.కొబ్బరి, మిర్చి, పసుపు, ఉప్పు, చింత పండు కలిపి మెత్తగా రుబ్బుకొవాలి.బాణలిలో నూనె పోసి మినప పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి.తరువాత కొబ్బరి ముద్ద, పప్పు, ఆకు వేసి 5 ని లు సన్నని సెగ మీద ఉడికించాలి.
చివరకి దించేముందు కొత్తిమీర జల్లి దించుకోవాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు