మామిడికాయ పులిహోర

మామిడికాయ పులిహోర

కావలసిన పదార్థాలు
బియ్యం ; ఒక కేజీ
మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్
పల్లీలు; 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు ; 4 టీ స్పూన్స్
సెనగపప్పు ; 4 టేబుల్ స్పూన్స్
అల్లం ; 2అంగుళాల ముక్క
కరివేపాకు ; 2 కట్టలు
ఎండుమిరపకాయలు ; 15
పచ్చిమిరపకాయలు; 20
ఆవాలు ; 2 టీ స్పూన్స్
మామిడికాయలు ; 3
పసుపు ; 2 టీ స్పూన్స్
ఇంగువ ; 1 టేబుల్ స్పూన్
నూనె ; 3 గరిటెలు
తయారు చేసే విధానం:
ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం ఆరబెట్టాలి.
తరువాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నునే పోసి అందులోనే మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ ఎండుమిరప ముక్కలు , 4మెంతి గింజలు పసుపు వేసి దోరగా వేయించాలి .
అల్లం ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .
మామిడి కాయలకు పీలర్తో పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
దోరగా వేగిన పోపులో పచ్చి మిరప ముక్కలు ,అల్లం,కరివేపాకు ,ఉప్పు వేసి ఒక నిముషం తరువాత గ్రైండ్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసి 5 నిమిషాలు ఉంచి బేసిన్లోని అన్నంలో బాగా కలపాలి.
అంతే ఘుమగుమ లాడే వేడి వేడి మామిడి కయ పులిహోర రెడీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు