రవ్వ పులిహోర

రవ్వ పులిహోర




రవ్వ పులిహోర
కావలసిన పదార్థాలు
రవ్వ - ఒక కప్పు,
పచ్చిమిరపకాయలు - 5,
పల్లీలు - పావు కప్పు,
కరివేపాకు - నాలుగు రెమ్మలు,
నిమ్మకాయలు - 2,
ఎండు మిరపకాయలు - 2,
శనగపప్పు - 2 చెంచాలు,
మినపప్పు - ఒక చెంచా,
ఆవాలు - అర చెంచా,
జీలకర్ర - అర చెంచా,
పసుపు - పావు చెంచా,
ఉప్పు- తగినంత
నూనె - తగినంత
తయారీ
రెండు కప్పుల నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, పసుపు వేయాలి. దీంట్లో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో వేసి పక్కన పెట్టాలి.
కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేగాక పల్లీలు వేసి వేయించాలి.
ఆ తర్వాత శనగ పప్పు, మినప పప్పు వేసి వేగనివ్వాలి.
దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి. కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వలో కలపాలి.
ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేస్తే రవ్వ పులిహోర తయార్



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు