మ్యాంగో కుల్ఫీ


మ్యాంగో కుల్ఫీ

కావలసిన వస్తువులు:

మామిడిపండు - 1
కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 1 కప్పు
పాలపొడి - పావు కప్పు
పంచదార - 3 టీ స్పూన్లు
యాలకులపొడి - పావు టీ స్పూన్‌
కుంకుమపువ్వు - కొద్దిగా
చెర్రీ ముక్కలు - 2 టీ స్పూన్లు

తయారు చేసే విధానం:

మామిడిపండు పై తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. లోపల టెంక తీసేయాలి. మామిడి పండు ముక్కలు, పంచదార, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాలపొడి వెడల్పాటి పాన్‌లో వేసి కలుపుతూ దగ్గరగా అయ్యేంతవరకు మరిగించాలి. ఆ తర్వాత దించి చల్లార్చాలి. ఫ్రీజర్‌లో గట్టిపడేంతవరకు ఉంచి ఐస్‌క్రీమ్‌ కప్పులో వేసి సర్వ్‌ చేయాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు