సగ్గుబియ్యం



సగ్గుబియ్యం 

సగ్గుబియ్యం అంటే వెజిటేరియన్ ప్రొసెస్డ్ ఫుడ్. అందువల్లే వ్రతాల సమయం లొ దీనిని ఎక్కువగా వాడతారు. సాగొ అనే పేరుతొ ప్రాచుర్యం పొందిన సగ్గుబియ్యం కర్ర పెండలం నుండి తీసుకోబడిన పొడి నుండి తయారుచేయబడుతుంది. ఛౌవ్వరి, సగుదనా, అవ్వరిషి గా సగ్గుబియ్యం ప్రసిద్ది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ కొవ్వు తక్కువగా ఉండే పదార్ధం ఇది. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. పాలు తరువాత చిన్న పిల్లలకి తినిపించదగిన ఆహార పదార్ధం ఇది. అలాగె పండుగల సమయం లో కూడా వీటిని వాడతారు. స్టార్చ్ శాతం ఎక్కువగా ఉండి కౄత్రిమ తీపి పదార్ధాలు అలాగే రసాయనాలు లేకపొవడం వల్ల సగ్గు బియ్యాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే రోగులకు కూడా ఇది తక్షణ శక్తి నిచ్చే అహార పదార్ధం గా దీనిని వాడతారు. అలాగే ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఇందులో ఉన్నందువల్ల దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు